పెండింగ్ లో ఉన్న ల్యాండ్ రెగ్యులేషన్ పథకం క్రింద ఉన్న దరఖాస్తులను వెంటనే పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులు, రెవిన్యూ, పంచాయతీ, నీటి పారుదల శాఖల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎల్. ఆర్. ఎస్. పథకం క్రింద వచ్చిన అర్జీలను పరిశీలించి క్షేత్ర పర్యటనలు చేసి ఆయా భూములను సర్వే నెంబర్ ల వారీగా పరిశీలించాలని తెలిపారు.