ఆడబిడ్డలకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా సమైక్య ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలు, చిన్నారులు గురువారం జరిగే బతుకమ్మ పండుగ వైభవంగా నిర్వహించుకోవాలని తెలిపారు. పూలనే దేవుడిగా కొలిచే సంప్రదాయం తెలంగాణ ప్రజలదని కొనియాడారు. బతుకమ్మకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని పేర్కొన్నారు.