కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ దుర్గా నవరాత్రోత్సవ మండలి వారి 40వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా అమ్మవారిని ప్రతిష్టించిన 7వ రోజు శ్రీ సరస్వతీ దేవి అవతారంలో భక్తులకు అపురూప దర్శన మిచ్చింది. ఈ సందర్భంగా దుర్గాదేవికి చప్పన్ భోగ్ (56 రకాల) మహా నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు ఒడిబియ్యం పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.