కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ ఉత్సవాలను డిసెంబర్ 21వ తేదీ నుండి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గూడెల్లి గంగారం బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మల్లికార్జున స్వామి ఉత్సవాలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ నెల 21న మైలపోలు కార్యక్రమం ఉంటుందని చెప్పారు.