కామారెడ్డి పట్టణంలోని తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ శారద మాత దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చింది. ఉదయం చిన్నారులకు అక్షరాభ్యాసాలు, సాయంత్రం సువాసినులచే కుంకుమ అర్చనలు జరిపారు. ఈ పూజలు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయశర్మ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.