పిట్లం ఫారెస్ట్ ఆఫీసు వెనకాల నోచుకోని పారిశుద్ధ్యం
పిట్లం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ దగ్గర ఉన్న చర్చి వెనకాల రోడ్డుకిరువైపులా చెట్లు పెరిగి పాములు, ముంగిసలు తిరుగుతున్నాయని కాలనీవాసులు తెలియజేయడం జరిగింది. చెత్తాచెదారంతో అపారిశుద్ధ్యం నెలకొంది. కాలనీలో ఎక్కడపడితే అక్కడ చెత్త చెదారంతో కంపు కొడుతోంది. మురికి కాలువలో చెత్త పేరుకుపోయి దోమల బెడద ఎక్కువైందని కాలని వాసులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.