సలాబత్పూర్ రాష్ట్ర సరిహద్దులో వాహనాలు తనిఖీలు
జుక్కల్ సెగ్మెంట్ మద్నూర్ మండలం సలాబత్పూర్ తెలంగాణ-మహారాష్ట్ర రాష్ట్ర సరిహద్దు వద్ద వరిధాన్యంపై అధికారులు తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారంగా రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో వ్యవసాయ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రంలోకి వరి ధాన్యాల సరఫరా కాకుండా ఎప్పటికప్పుడు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ ఏవో రాజు ఉన్నారు.