జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మద్నూర్ నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య, సెగ్మెంట్ నేతలతో రాష్ట్ర రోడ్లు & భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని హైదరాబాద్ లో బుధవారం కలిసారు. జుక్కల్ సెగ్మెంట్ లో మార్కెట్ కమిటీ చైర్మన్ల ఎంపిక విధానం తెలుసుకున్న మంత్రి ఎమ్యెల్యేని అభినందించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇంటర్వ్యూ పద్ధతిలో ఏఎంసీ చైర్మెన్ ల ఎంపిక చేయడం గమనార్హం.