కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. గురువారం కలెక్టర్ భవన నిర్మాణ భూమిని పరిశీలించారు. మహిళా శక్తి భవన నిర్మాణానికి జాతీయ రహదారి నెంబర్ 44 ప్రక్కన గల సర్వే నెంబర్ 527 లో ఒక ఎకరం భూమి కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. మహిళాశక్తి భవన నిర్మాణానికి ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు.