రైతులు సోయా కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని జుక్కల్ ఎమ్యెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. శుక్రవారం జుక్కల్ సెగ్మెంట్ బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు దళారులను ఆశ్రయించుకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో పండించిన సొయా అమ్ముకొని గిట్టుబాటు ధర పొందాలన్నారు. అధికారులు, కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.