జూబ్లీహిల్స్: ఫ్యాన్ కు ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
వెంగల్ రావు నగర్ కు చెందిన వినోద్ కు భార్య అవిలాష్ కౌర్, కొడుకు ఉన్నారు. వినోద్ బార్బర్ పని చేసేవాడు. కొంత కాలంగా వినోద్ మద్యానికి బానిస అయ్యాడు. ప్రతిరోజులాగే శుక్రవారం సాయంత్రం భార్య, బాబు వినోద్ కోసం ఎదురు చూడగా అతను రాలేదు. వారు ఇంటికి వెళ్లి చూడగా వినోద్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని కనిపించాడు. భార్య చుట్టు పక్కల వారి సాయంతో వినోద్ ను కిందకు దింపి మధురానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.