చందూర్ లో పోలింగ్ బూత్ ను పరిశీలించిన సబ్ కలెక్టర్
చందూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్ బూత్ లను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓటర్ నమోదు పక్రియ గురించి అధికారులకు వివరించారు. 18 సంవత్సరాల నిండిన యువతకు ఓటు హక్కు నమోదు ఫారం నం 6 , సవరణలకు ఫామ్ నంబర్ 8 ద్వారా దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈనెల 28 వరకు దరఖాస్తుకు అవకాశం ఉందన్నారు.