నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండల కేంద్రం పాతవర్ని గ్రామంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలు గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సోనియాగాంధీ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ కేక్ కట్ చేసి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు యువకులు సీట్లు పంచారు.