కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పనిచేసిన కార్యకర్తకు అధిష్టానం తగిన గుర్తింపు ఇస్తుందనడానికి ఉదాహరణ వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి లభించడమేనని కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ గురువారం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని బలోపేతం చేసేందుకు రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని, క్షేత్రస్థాయిలో మార్కెట్ కమిటీ చైర్మన్ లు రైతాంగాన్ని బలోపేతం చేసే విధంగా వారికి అండగా ఉండి సేవలందించాలన్నారు.