పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు జైస్వాల్ 90*, కేఎల్ రాహుల్ 62* పరుగులు చేశారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. ఆసీస్ గడ్డపై టెస్టుల్లో భారత్‌కిది రెండో అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం. 1986లో సునీల్ గవాస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్ జోడీ 191 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉంది. 1981లో గవాస్కర్, చేతన్ చౌహాన్ ఓపెనింగ్ ద్వయం 165 రన్స్ చేసింది.