జగిత్యాల పట్టణ కేంద్రంలో టౌన్ హాల్ లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం రేకుర్తి కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షులు తాటిపాముల వినోద్ కుమార్ మాట్లాడుతూ. కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రి డాక్టర్లచే వైద్య శిబిరం ఏర్పాటు చేశామని 164 మందిని డాక్టర్లు పరీక్షించి 84 మందికి ఆపరేషన్ అవసరమని డాక్టర్లు తెలిపారు.