ఈనెల 26 న జగిత్యాల జిల్లా మల్యాలలో జరగబోయే జగిత్యాల జిల్లా బీడీ కార్మికుల (ఏఐటీయూసీ ) అనుబంధ సంఘం మహాసభను జయప్రదం చేయాలని జిల్లా నాయకులు ఇరుగురాల భూమేశ్వర్ శుక్రవారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా లక్ష పైచిలుకు కార్మికులు ఉంటారని పేర్కొన్నారు. బీడీ పరిశ్రమ సంక్షోభంలో అనేక హక్కులు సంక్షేమ పథకాలు కోల్పోతున్నారు.