దొంగతుర్తిలో అమర జవాన్లకు నివాళులు

67பார்த்தது
దొంగతుర్తిలో అమర జవాన్లకు నివాళులు
ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలోని యువత ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి బ్లాక్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా కొవ్వొత్తులతో గ్రామంలో ర్యాలీ నిర్వహించి పుల్వామా దాడిలో అమరులైన భారత వీర జవాన్లకు నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న భారత సైనికుల సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ప్రజా ప్రతినిధులు, పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி