రాజారాంపల్లి ఎండపల్లి మండలంలోని రహదారుల వెంబడి గల ఓఎఫ్సీ కేబుల్ రంధ్రాలు ఎప్పుడు పూడ్చుతారని ప్రయాణీకులు ప్రశ్నిస్తున్నారు. రాయపట్నం కరీంనగర్ ఎస్.హెచ్.7 రహదారి పక్కన రాజారాంపల్లి పాతగూడూరు మూల మలుపు వద్ద రంధ్రం పూడ్చడలేదు. ఇలాంటివి అనేక చోట్ల అనేకంగా ఉన్నాయి. ఓఎఫ్సీ కేబుల్ పనుల వల్ల ఎండపల్లికి చెందిన ఒక వ్యక్తి మరణించాడు. ప్రాణాలు పోయినా నిర్వహణలో చలనం లేక పోవడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.