జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10 వ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు అదే గ్రామానికి చెందిన రోహిణి పాల పాడి పరిశ్రమ యజమాని గొల్ల రాజు సోమవారం పరీక్ష ప్యాడులు, పెన్నులు పంపిణీ చేశారు. ఎండపల్లి ఎంఈఓ గుండాటి రామచంద్రం మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాల సాధనకై కష్టపడి చదవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ స్థాయి అధికారులు, ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొన్నారు.