జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రానికి చెందిన చీకటి వెంకటేషం ఇటీవల గుల్లకోటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. మృతుడి కుటుంబానికి 1990- 91 సంవత్సరంలో ఆయనతో కలిసి పదవ తరగతి చదువుకున్న సహచర క్లాస్ మేట్లు శనివారం 21 వేయి ఐదు వందల రూపాయల నగదును అందించి ఉదారతను చాటుకున్నారు. బీజేపీ ఎండపల్లి మండల అధ్యక్షుడు రావు హన్మంతరావు, కొందరు స్నేహితులు పాల్గొన్నారు. ఆపదలో ఆదుకున్నందుకు ధన్యవాదములు తెలిపారు.