ఎండపల్లి మండలం అంబారిపేట గ్రామానికి చెందిన అరెల్లి విఘ్నేష్ ఇటీవల ముత్తూనూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా గురువారం ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి తాటిపర్తి శైలేందర్ రెడ్డి, గాజుల విజయ్, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.