ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలోని జిన్నింగ్ అండ్ ప్రాసెసింగ్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రం శుక్రవారం ప్రారంభం కానుంది. ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారని వ్యవసాయ మార్కెట్ కమిటీ వెల్గటూరు ఛైర్మన్ గుండాటి గోపిక జితేందర్ రెడ్డిలు గురువారం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.