నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో ఇటీవల దాదాపు 800 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఫైన్ కేటరింగ్ సర్వీసెస్, అనూష హాస్పిటాలిటీల సేవల్ని తక్షణం రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విచారణ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా మరే ఇతర టెండర్లలో పాల్గొనకుండా బ్లాక్ లిస్టులో ఉంచాలని, క్రిమినల్ చర్యలను ప్రారంభించాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు.