పసుపులో విషం ఉందని తాజాగా ఓ అధ్యయనం స్పష్టం చేసింది. భారత్‌లోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పసుపు నమూనాలలో సీసం అధిక మోతాదులో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. హానికరమైన లెడ్ క్రొమేట్‌ను పసుపులో కలుపుతున్నారు. లెడ్ అనేది రసాయనిక లోహం.. దీన్నే సీసం అని కూడా పిలుస్తారు. ఈ లోహం మన శరీరంలోకి ప్రవేశిస్తే దాని వల్ల మెదడు, గుండె, కిడ్నీలు, మూత్రపిండాలు పాడవుతాయి. అంతేకాదు జీర్ణక్రియ కూడా మందగిస్తుంది.