అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని యాకుత్ పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మీరాజ్ అన్నారు. శనివారం తలాభ్ చంచలం డివిజన్ పరిధి భవానీ నగర్ లో అయన పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.