వికారాబాద్ రైల్వే జంక్షన్, రైల్వే స్టేషన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ భర్తేశ్ కుమార్ జైన్, రైల్వే ఇంజినీరింగ్ అధికారుల బృందంతో కలిసి శనివారం పనులను తనిఖీ చేశారు. డిజైనింగ్ పనులు మొదటగా పూర్తి చేయాలని, అనంతరం ఆర్కిటెక్చర్ పై దృష్టి పెట్టాలని అధికారులను DRM ఆదేశించారు. అనంతరం రైల్వే ట్రాక్ సేఫ్టీని సైతం తనిఖీ చేశారు.