గతంలో మాదిరిగానే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావించడం పట్ల బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మీరు రిజర్వేషన్లు పెంచినప్పుడు కులగణన ఎందుకు చేసినట్లని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని లింగంగౌడ్ బీసీలకు పిలుపునిచ్చారు.