రామంతాపూర్ శ్రీనగర్ కాలనీలోని శ్రీ భక్త ఆంజనేయస్వామి దేవాలయంలో 15 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. విగ్రహం ఏర్పాటుకు శనివారం జరిగిన భూమి పూజకు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మందుముల పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో 15 అడుగుల హనుమాన్ విగ్రహం ఏర్పాటుకు ఆలయ కమిటీ ముందుకు వచ్చినందుకు వారిని అభినందించారు.