మల్లాపూర్ డివిజన్ ఎస్వి నగర్ కాలనీలో సీఎం నిధులతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం అయ్యాయి. ఉప్పల్ కాంగ్రెస్ ఇన్ చార్జ్ మందుముల పరమేశ్వర రెడ్డి సహకారం తో, గ్రేటర్ కాంగ్రెస్ నాయకులు నెమలి అనీల్ కుమార్ చొరవ తీసుకొని సిఎం నిధులతో పనులు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల ప్రజలకి అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలు అందించేందుకు పని చేస్తుందని నెమలి అనీల్ అన్నారు. శనివారం సీసీ రోడ్డు పనులను వారు పరిశీలించారు.