నాచారం డివిజన్ పరిధిలోని భవాని నగర్, కార్తికేయ నగర్ బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు వెంటనే మంజూరు చేయాలని ఎల్బీనగర్ ఎస్ఈ నిత్యానందను కార్పొరేటర్ శాంతి శేఖర్ కోరారు. బ్రిడ్జుల నిర్మాణానికి రూ. 1. 50 కోట్ల నిధులతో ప్రారంభించాలని కోరారు. డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధిపై ఆయనతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సాయి జన్ శేఖర్ పాల్గొన్నారు.