పెట్టుబడి పెడితే పాట్నార్షిప్ ఇస్తానని నమ్మించి రూ. కోట్ల రూపాయలు దండుకుని మోసగించిన దంపతులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితులపై బోయిన్పల్లి, తిరుమలగిరి, మహాంకాళి పోలీసు స్టేషన్లో కూడా చీటింగ్ కేసులు నమోదు అయ్యాయి. చిక్కడపల్లికి చెందిన దినేశ్(50), జ్యోతి (47) దంపతులు. సికింద్రాబాద్లో వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో పెట్టుబడి అంటూ పలువురిని మోసం చేసి అరెస్టయ్యారు.