సికింద్రాబాద్, పార్శిగుట్ట, క్లాక్ టవర్, సిటిసి తదితర ప్రాంతాలలో గల్లి గల్లికి దోమల నివారణ కోసం ఫాగింగ్ చర్యలు చేపట్టినట్లు జిహెచ్ఎంసి ఎంటమాలజీ బృందం తెలియజేసింది. ప్రతి వారానికి ఒకసారి ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దోమలు ఇంటి గది లోపలికి చేరకుండా దోమతెరలు వాడాలని ఎంటమాలజీ చీఫ్ రాంబాబు ప్రజలకు సూచించారు.