సీఎం సహాయనిధి పేదలకు వరం లాంటిదని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్ తెలిపారు. ఈ మేరకు సీఎం సహాయ నిధి పథకం కింద మంజూరు అయిన ఎల్బీసీ పత్రాలను లబ్ధిదారులకు సికింద్రాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పద్మారావు గౌడ్ బుధవారం అందజేశారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.