సికింద్రాబాద్ పరిధిలోని సీతాఫాల్మండి ప్రాంతంలో ఉన్న గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లను జీహెచ్ఎంసీ అధికారి సుభాష్ రావు శనివారం తనిఖీ చేశారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల పై చెత్తను వేయకూడదని అధికారి సూచించారు. ప్రతిరోజు ఇంటి వద్దకు వచ్చే స్వచ్ఛ ఆటోకు మాత్రమే చెత్తను వేరుచేసి వేయాలని సూచించారు. స్వచ్ఛ హైదరాబాద్ కోసం అందరు సహకరించాలని కోరారు.