సికింద్రాబాద్ మోండా మార్కెట్లో రోడ్లపైనే వ్యాపారం చేస్తూ నిత్యం ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నారు. మార్కెట్లో వ్యాపారం చేసే వారు వారి దుకాణాల ముందు ఉన్న ఫుట్పాత్ ప్రాంతాన్ని వేరే వ్యక్తులకు రోజువారీగా కిరాయికి ఇస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ నుంచి మొదలుకొని మోండా మార్కెట్, బాట, సుభాష్ రోడ్డు, జనరల్ బజార్ వరకు ఇదే పరిస్థితి నెలకొంటుంది.