చిలకలగూడ పీఎస్ పరిధిలో రైల్వే ఎంప్లాయ్ మిస్సింగ్
చిలకలగూడ పీఎస్ పరిధి ఓ రైల్వే ఎంప్లాయ్ అదృశ్య మయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఏ వెంకటేశ్(37)కు కవితతో 8 ఏండ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతరులు తీసుకున్న అప్పు విషయంలో షూరిటీగా ఉన్న వెంకటేశ్‌కు భార్యకు గొడవలు జరిగాయి. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన భర్త ఇప్పటివరకు తిరిగి రాలేదు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.