వెంకటాపురంలో మంగళవారం కంటోన్మెంట్ అధికారులతో కలిసి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పర్యటించారు. అనంతరం రాజీవ్ గాంధీ నగర్ ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలపై పరిశీలించారు. చత్రిగడ్డ ప్రహారీ, వర్షపు నీరు, పాముల బెడద, దోమల నివారణ, పారిశుద్ధ్య సమస్యలపై సీఈఓ మధుకర్ నాయక్తో ఎమ్మెల్యే చర్చించారు. కంటోన్మెంట్లో ఉండే డ్రైనేజీ పైపులైన్లకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు.