పోలీసులకు చెప్పి ఇల్లు అద్దెకివ్వండి: సీఐ లక్ష్మీనారాయణ

53பார்த்தது
పోలీసులకు చెప్పి ఇల్లు అద్దెకివ్వండి: సీఐ లక్ష్మీనారాయణ
అపరిచిత వ్యక్తులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బోయిన్పల్లి సీఐ లక్ష్మీనారాయణరెడ్డి అన్నారు. దిల్సుక్ నగర్ బస్తీ వాసులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. మీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు, సంబంధం లేని వారు సంచరిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. ఇళ్ల అద్దె కోసం వస్తే వారి పూర్తి వివరాలు సేకరించడంతోపాటు ఆధార్ కార్డును పరిశీలించాలన్నారు. అవసరమైతే పోలీసులను సంప్రదించిన తర్వాత అద్దెకు ఇవ్వాలన్నారు.

தொடர்புடைய செய்தி