సీతఫల్మండి డివిజన్ కార్పొరేటర్ డా. సామల హేమ డబుల్ బెడ్రూమ్ వద్ద స్ట్రామ్ వాటర్ లైన్, జోషి కాంపౌండ్లో సీసీ రోడ్ పనులను సోమవారం పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జోషి కాంపౌండ్ లో ఎలక్ట్రిసిటీ పోల్ డ్యామేజ్ అయ్యిందని స్థానికులు ఫిర్యాదు చేయగా.. సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.