బన్సీలాల్ పేటలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా మారింది. జిహెచ్ఎం అధికారుల నిర్లక్ష్యంతో డివిజన్ లోని ప్రధాన రోడ్లు చెత్తకుప్పలతో నిండిపోతున్నాయని మంగళవారం స్థానికులు వాపోతున్నారు. జబ్బర్ కాంప్లెక్స్ నుంచి గాంధీనగర్ కు వెళ్ళే రోడ్డుపైనే చెత్త నిల్వలతో దోమలు, దుర్వాసన పెరిగాయని, దాంతో తాము రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త వేయవద్దంటూ ఒక బ్యానర్ కట్టి చేతులు దులుపుకున్నారని అన్నారు.