ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, డీఏ, పీఆర్సీలను వెంటనే ప్రకటించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు (తపస్) డిమాండ్ చేశారు. రాష్ట్ర శాఖ పిలుపుమేరకు దశల వారి నిరసన కార్యక్రమాలలో భాగంగా సోమవారం సాయంత్రం తపస్ ప్రతినిధులు అడ్డగుట్టలోని మారేడుపల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో భీమయ్య కు వినతిపత్రం సమర్పించారు.