సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు వరంగా మారిందని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం మారేడ్‌పల్లిలోని తన నివాసంలో లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం మాట్లాడుతూ. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా పొందేందుకు సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకుంటే త్వరగా చెక్కులు మంజూరయ్యే లా చూస్తామన్నారు.