దేశానికి 4 సార్లు ప్రధానిగా పనిచేసిన ఇందిరాగాంధీ పేద ప్రజల అభ్యున్నతికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ తెలిపారు. ఇందిరాగాంధీ 107వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం రసూలురాలోని ఇందిరా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి ఇందిరాగాంధీ రాజ్య స్థాపన కోసం నిరంతరం శ్రమిస్తున్నారన్నారు.