సీసీ రోడ్డు వేయడం కోసం రోడ్డంతా తవ్వి చెట్లు తొలగిస్తేనే రోడ్డు వేస్తామని అధికారులు అంటున్నారని స్థానికులు వాపోతున్నారు. స్థానికులు చెట్లను తొలగించాలని డిడి కట్టడంతో పాటు అటవీశాఖ అధికారికి అర్జీ పెట్టుకున్నారు. కానీ కార్పొరేటర్ తరపున, ప్రభుత్వం నుండి నెలరోజు కావస్తున్న ఎటువంటి స్పందన రావడం లేదని భవానీ నగర్ వాసులు మంగళవారం వాపోతున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.