సికింద్రాబాద్, పార్సిగుట్ట, బోయిగూడ ప్రాంతాల్లో డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా మంగళవారం ఎంటమాలజీ బృందం గుర్తించింది. ఈ మేరకు రంగంలోకి దిగిన అధికారులు వివరాలను నమోదు చేసుకున్నారు. అనంతరం డెంగ్యూ పాజిటివ్ వచ్చిన ఇళ్లతో పాటు, పరిసర నివాస గృహాల్లోనూ క్రిమిసంహారకాలను పిచికారి చేసి, చికెన్ గున్యా, మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులపై అవగాహన కల్పించారు.