సికింద్రాబాద్ నియోజకవర్గం ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. స్థానిక మోండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేశ్ పలువురు బీజేపీ నేతలతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. ఆమె మాట్లాడుతూ.. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. లేదంటే వెంటనే సీఎం రేవంత్ రెడ్డి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.