గత రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 30 లక్షలతో షాబాజీగూడలోని ఎస్ఆర్ హాస్పిటల్ వెనుక జరుగుతున్న సీసీ రోడ్డు పనులను సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీసీ రోడ్డు పనులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్కు సూచించారు. స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.