చిలకలగూడ: మేడిబావిలో యువకుడి అదృశ్యం

56பார்த்தது
చిలకలగూడ: మేడిబావిలో యువకుడి అదృశ్యం
చిలకలగూడ పీఎస్ పరిధిలో ఓ యువకుడు మిస్సింగ్ అయిన కేసు వివరాలను ఎస్సై సబిత మంగళవారం వెల్లడించారు. సీతాఫల్మండి మేడిబావికి చెందిన కవిత ఈనెల 5న షాద్ నగర్ వెళ్లగా, కొడుకు కిషోర్ (24) ఒంటరిగా ఇంటి వద్దే ఉన్నారు. తల్లికి ఫోన్ చేసి తాను హనుమకొండలోని అమ్మమ్మ ఇంటికి వెళుతున్నానని చెప్పాడు. సాయంత్రం కవిత కుమారుడికి ఫోన్ చేయగా, లిఫ్ట్ చేయలేదు. ఇంటికి ఇంతవరకు కొడుకు కిషోర్ తిరిగి రాలేదని తల్లి పోలీసులను ఆశ్రయించారు.

தொடர்புடைய செய்தி