కంటోన్మెంట్ బోర్డు 6వ వార్డు నందమూరినగర్ లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ హామీ ఇచ్చారు. సోమవారం నందమూరినగర్ లో బస్తీబాట కార్యక్రమం, బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్తీలో స్థానికులు భూగర్భ డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నట్లు రామకృష్ణకు ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.